Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో తెలుగు మ‌హిళ‌కు అరుదైన గౌర‌వం

Jaya Badiga Appointed As California Judge
Advertisement
  • కాలిఫోర్నియా తొలి తెలుగు జ‌డ్జిగా జ‌య బాడిగ 
  • శాక్ర‌మెంట్ కౌంటీ సుపీరియ‌ర్ కోర్టు జ‌డ్జిగా నియామ‌కం
  • జ‌య బాడిగది ఏపీలోని విజ‌య‌వాడ‌
Advertisement
అమెరికాలో తెలుగు మ‌హిళ జ‌య బాడిగకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. కాలిఫోర్నియాలోని శాక్ర‌మెంట్ కౌంటీ సుపీరియ‌ర్ కోర్టు జ‌డ్జిగా ఆమె నియ‌మితుల‌య్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జ‌డ్జిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి వ్య‌క్తిగా నిలిచారు. 2022 నుంచి ఇదే కోర్టులో ఆమె క‌మీష‌న‌ర్‌గా కొన‌సాగుతున్నారు. 

ఏపీలోని విజ‌య‌వాడ‌కు చెందిన జ‌య బాడిగ.. హైద‌రాబాద్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. అనంత‌రం అమెరికా వెళ్లిన ఆమె బోస్ట‌న్ విశ్వ‌విద్యాల‌యంలో ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత‌ శాంటా క్లారా విశ్వ‌విద్యాల‌యం నుంచి లా ప‌ట్టా అందుకున్నారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్‌ బార్ ఎగ్జామ్ క్లియ‌ర్ చేశారు. 

10 ఏళ్ల‌కు పైగా న్యాయ‌వాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్‌లో కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో లాభాపేక్ష లేకుండా ప‌లు కేసుల్లో ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదించారామె. అలాగే మెక్‌జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో అధ్యాపకురాలిగాను ప‌ని చేశారు.
Advertisement
Advertisement
Jaya Badiga
NRI
California Judge
USA

More Telugu News